ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపికి వచ్చిన ఓట్లు 47% .. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 43% కన్నా ఎక్కువ . అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య తేడా మూడున్నర నుంచి నాలుగు శాతం ఓట్లు మధ్య మాత్రమే ఉంటుంది .. ఇక కాంగ్రెస్ పార్టీకి 7 శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పని చేసింది .. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసారు కానీ అది కలిసి రాలేదు .. ఆ బంధాన్ని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించి ఉంటే ఓట్లు బదిలీ జరిగి ఉండేది కేజ్రీవాల్ , సిసోడియా వంటి వాళ్ళు స్వల్ప తేడాతో ఓడిపోయేవారు కాదు .. ఈ గోరా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు.
ఈ క్రమంలోనే గత రెండు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో కాంగ్రెస్ కు ఒక సీటు కూడా రాలేదు .. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది . అయితే ఈసారి నాలుగు శాతం ఓట్లు పెంచుకుంది .. ఇప్పుడు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది .. హర్యానాలో కాంగ్రెస్ కూడా ఇదే తప్పు చేసింది . అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకుని ఉంటే ఎంతోకొంత మేలు జరిగి ఉండేది కానీ అలా చేయలేదు ఢిల్లీలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఇప్పుడు అదే తప్పు చేసి నిండా మునిగిపోయింది. ఇప్పుడు చేతులు కాలక ఆకులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది.