![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/delhi-politcies-27-ealla-tharuvartha-delhi-kotapi-kahsya-jandaa04a5e80-8994-45ec-b88c-19e9df763566-415x250.jpg)
బిజెపి పార్టీ ఢిల్లీలో చారిత్రాత్మక విజయం అందించడంతో నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అభివృద్ధి గెలిచిందని సుపరిపాలన సాగుతుంది అంటూ తెలియజేశారు. హస్తినా ప్రజలకు సెల్యూట్ మీరు అందించిన ఈ ప్రేమ సహకారానికి శతకోటి వందనాలు అంటూ తెలియజేశారు.. ఢిల్లీ అభివృద్ధికి ప్రజలు జీవనాన్ని మెరుగుపరిచే విధంగానే అన్ని దిశల అడుగులు వేస్తాము అందుకు మేము గ్యారెంటీ అంటూ తెలియజేశారు. అందుకు సంబంధించి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ నుంచి ఒక పోస్టుని కూడా షేర్ చేయడం జరిగింది.
భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఢిల్లీలో బిజెపి పార్టీ విజయంతో రాత్రి పగలు కష్టపడి శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నేతలకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని సైతం ఓడించి రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి దేశ రాజధానిలో బిజెపి పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఉదయం ఓట్లు లెక్కింపును సైతం ప్రారంభించి మొదటి దశలోని బిజెపి పార్టీ భారీ ఆదిత్యంలో ఉన్నది.. ఢిల్లీలో 70 సీట్లలో కనీసం 50 సీట్లలో ఆదిత్యతాన్ని నమోదు చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత AAP స్వల్పంగా పోటీపడిన మధ్యాహ్నం సమయానికి 85% పైగా ఓట్లు బిజెపి పార్టీని కైవసం చేసుకుంది.