ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి ,జనసేన, బిజెపి పార్టీ ఉన్నది.. 2024 లో అధికారం చేపట్టిన లోలోపల మాత్రం విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది నేతలు చేస్తున్న పని వల్ల చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో జనసేన పార్టీకి చెందిన ఇంచార్జ్ ఒక మహిళా దగ్గర నుంచి కోటి రూపాయలకు పైగా అప్పు తీసుకొని ఎగ్గొట్టారని తిరిగి అడుగుతుంటే ఆమెను బెదిరిస్తూ ఉన్నారని.. తనకు చావే దిక్కు అంటూ ఒక సెల్ఫీ వీడియోతో కలకలం సృష్టిస్తోంది మహిళ.


పూర్తి వివరాల్లోకి వెళితే తన పేరు లక్ష్మి అట.. లైఫ్ లో ఒకరిని నమ్మి చాలా మోసపోయానని సుమారుగా కోటి 20 లక్షల వరకు అప్పు తీసుకువచ్చి ఇచ్చానని అయితే అతను మాత్రం తన పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని.. తన వద్ద కేవలం 30 లక్షల రూపాయలకే బాండ్ చెక్కులు రాయించుకున్నారు అంటూ ఒక వీడియోని తెలియజేసింది. అంతటితో ఆగకుండానే తన బెదిరిస్తూ ఉన్నారని తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని ఈ వీడియోలో తెలియజేసింది.


అప్పులు ఎక్కువ అవ్వడం చేత పిల్లలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నానని ఇక తన బతకాలో లేదో అంటూ వీడియోలో తెలియజేసింది. అలాగే తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జిగా ఉన్న కిరణ్ రాయ్ అంటూ అతని పేరుని కూడా బయట పెట్టడం జరిగింది. తాను మరణించిన తర్వాత ఆయన ఆ డబ్బులు తన పిల్లలకు చెందుతాయేమో అన్నట్లుగా ఆమె ఆశిస్తున్నాను అంటూ వెల్లడించింది. తాను కిరణ్ వల్లే చనిపోతున్నారని తెలియజేసిన ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయం పైన అటు జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయ్ ఎలా స్పందిస్తారో ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: