తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసిఆర్ సీఎంగా చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎంగా పేరు పొందారు.. కానీ రాష్ట్రాన్ని మాత్రం పూర్తిగా అప్పులపాలు చేశారు.. అలా రెండు పర్యాయాలు  సీఎం కుర్చీకి గాని బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మచ్చ లేకుండా  రాజకీయాన్ని సీఎం కేసీఆర్ నడిపారని చెప్పవచ్చు.. 10 సంవత్సరాలు ఏకదాటిగా పాలన చేశారు కాబట్టి తప్పనిసరిగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది.. ఇదే వ్యతిరేకతను ఆసరాగా చేసుకున్నారు కాంగ్రెస్ అధిష్టానం..ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అందించారో అప్పటినుంచి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది.. అన్ని వర్గాలను ఏకం చేసి ప్రభుత్వం చేసే తప్పులను వెలికి తీసి  ప్రతిక్షణం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు రేవంత్ రెడ్డి.. అంతేకాదు వారు అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు తీసుకువస్తామో చెప్పుకుంటూ వచ్చారు.. ఈ విధంగా అనేక పథకాలు, హామీలు ఇచ్చారు.. 

చివరికి కాంగ్రెస్ పార్టీ అద్భుత మెజారిటీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠాన్ని రేవంత్ రెడ్డి అధిరోహించారు.. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, వంటి హామీలు తప్ప మిగతావేవీ నడవడం లేదు.. వీరి పాలన మొదలై ఇప్పటికే సంవత్సరకాలం గడిచింది. అయినా పథకాలన్నిటిని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. దీంతో ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు అధిష్టానానికి అర్థమైంది. ఇదే తరుణంలో సీఎం మార్పు ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదట..

అంతేకాదు త్వరలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని దానికోసం రాహుల్ గాంధీ కలవడానికి ఆసక్తి చూపలేదని, అంతేకాకుండా క్యాబినెట్ విస్తరణ కాస్త వాయిదా వేస్తారని అందులో చాలా మార్పులు ఉంటాయని రాహుల్ గాంధీ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. దీన్నిబట్టి చూస్తే మాత్రం  కొంతమంది మంత్రులను మార్చడమే కాకుండా ముఖ్య మంత్రి సీటు కూడా మార్పు ఉండబోతుందని  గాంధీభవన్ లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏడాదిలోపే వీరిపై తెలంగాణలో వ్యతిరేకత రావడమే అని తెలుస్తోంది.  సీఎం మార్పుకు సంబంధించి   ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: