గత కొంతకాలంగా వైసీపీ నేతల పైన అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉన్నారనే కూటమి ప్రభుత్వం పైన ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళ మంత్రులను కూడా వదలడం లేదు.. ఇటీవలే మాజీ మంత్రి విడుదల రజిని పైన తీవ్రమైన ఆగ్రహాన్ని టిడిపి నేతలు తెలియజేయడంతో ఆమె ఒక్కసారిగా ఫైర్ అవుతూ టిడిపి ఎమ్మెల్యే అయిన పత్తిపాటి పుల్లారావుకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కుట్రతోనే తన కుటుంబ సభ్యుల పైన అక్రమ కేసులు పెడుతున్నారని తనకే కాదని ఎమ్మెల్యే పుల్లారావుకు కూడా కుటుంబం ఉందనే విషయాన్ని మరిచిపోకూడదంటూ తెలియజేస్తోంది.


తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా అందరికీ తిరిగి చెల్లిస్తానంటూ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మాజీమంత్రి. కూటమి ప్రభుత్వం తనను టార్గెట్ చేయడానికి సహించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అక్రమ కేసులు పెట్టడం ఆమె ఫైర్ అవుతూ రాజకీయాలతో సంబంధం లేని వాళ్లను కూడా ఇరికిస్తున్నారనే విధంగా ఫైర్ అయ్యింది. తనకున్న ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాతికేళ్ల రాజకీయం కూడా పనికిరాదంటూ ఆమె ఫైర్ కావడం జరిగింది. తాను ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటానని టిడిపి ఎమ్మెల్యే అనుకుంటున్నారేమో.. తనకు ఇంకా వయసు ఉంది మరో 30 ఏళ్లు 40, ఏళ్లు దేవుడు కరుణిస్తే రాజకీయాలలో ఉంటానంటూ ఎవ్వరిని వదిలిపెట్టనట్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది విడుదల రజిని.


అక్రమ కేసులు పెట్టి తమ కుటుంబ సభ్యుల పైన ఏవేవో కుట్రలు పడుతున్నారు.. కేసులకు భయపడమని మరింత బలంగా ఎదుగుతామంటూ తెలియజేస్తోంది విడుదల రజిని. ఈ నాలుగేళ్ల ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఇల్లీగల్ పనులు చేసి బాగా సంపాదించుకోవచ్చేమో అనుకుంటున్నారేమో.. మీరు చేసిన అక్రమాలు దోపిడీలు అన్నీ మీరు ఎక్కడ ఉన్న లాక్కొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ ఫైర్ అయ్యింది మాజీ మంత్రి రజిని. అధికారులు ఉంటే తనకు చాలా గౌరవం అని.. కానీ ఇలా అక్రమాలకు కొమ్ము కాయొద్దండి అంటూ ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: