దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. శనివారం ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరిగింది. ఇందులో బిజెపి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించిందని చెప్పవచ్చు. మొత్తం 70 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో  బిజెపి 48 ఎమ్మెల్యే సీట్లను గెలవగా ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లను గెలిచింది. ప్రభుత్వం ఏర్పడడానికి కేవలం 36 సీట్లు అవసరం ఉంటాయి. కానీ బిజెపి మ్యాజిక్ ఫిగర్ ను దాటి  దూసుకుపోయిందని చెప్పవచ్చు. గత రెండు పర్యాయాలు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అంతేకాదు మాజీ సీఎం కేజ్రీవాల్ , సిసోడియా వంటి పెద్ద పెద్ద నేతలే  ఓటమి పాలయ్యారు.. ఇదే తరుణంలో బిజెపికి ఓటు బ్యాంకు దారుణంగా పెరిగిపోయింది.. దీనిపై తాజాగా  పలువురు ప్రముఖులు విశ్లేషణ చేస్తున్నారు.. ఈ తరుణంలో పార్థసారథి పొట్లూరి బిజెపి గెలుపుకు అసలు రహస్యం ఇదే అంటూ ఒక విషయాన్ని బయట పెట్టారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

 ఢిల్లీలో గత కొంతకాలంగా అక్రమ వలసదారులుగా ఉన్నటువంటి మయన్మార్ రోహిగ్యాలు వేసిన  ఓట్ల వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వచ్చిందని ఆయన అన్నారు. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నంతవరకు తమను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో వారు ఓట్లన్నీ వన్ సైడ్ వేసుకుంటూ వచ్చారట. అయితే ఈసారి బిజెపి ఢిల్లీపై దృష్టి పెట్టడంతో ట్రంఫ్ మాదిరిగా ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారందరిని వారి దేశాలకు  బిజెపి ప్రభుత్వం పంపిస్తుందని  భయపడిపోయారు. ఇదే తరుణంలో ఈసారి కేజ్రీవాల్ మమ్మల్ని కాపాడలేదని గ్రహించినటువంటి వీరు బిజెపికి ఓటేశారట.. అయితే చాలామంది ఆప్ ఓటమికి యమునా నది కాలుష్యం, లిక్కర్ స్కామ్  అనుకున్నారు కానీ ఇది చిన్న కారణాలు మాత్రమే.. ఆలిండియా  ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షులు  సాజిద్ రషీద్ బహిరంగంగానే నేను బిజెపికి ఓటేశానని చెప్పి వారి ఓట్లన్నీ బిజెపికి పడేలా చేశారని చెప్పవచ్చు.

వీళ్లంతా బిజెపికి ఓటు వేయడానికి ప్రధాన కారణం బిజెపి ఎలాగైనా గెలుస్తుంది మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొడుతుందని ఆలోచనతో ఓట్లు వేసి బీజేపీ నుంచి కాస్త సానుకూలత  ప్రభావాన్ని పొందాలని చూస్తున్నారట. దీనికి సాజీద్ రసీదు మధ్యవర్తితం వహిస్తారని, అందుకే ఆయన అక్రమ వలసదారుల ఓట్లన్నీ బిజెపికి పడేలా చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.. ఇందులో ఢిల్లీలో చాలామంది అక్రమ వరసదారులు రేషన్ కార్డులు, ఆధార్ కార్డు సృష్టించుకుని బ్రతుకుతున్నారని తేలింది.. ఎప్పుడైతే ఈ సెర్చ్ జరిగిందో  అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం బయటకు రావడంతో చాలామంది ప్రజలు బిజెపి వైపు తిరిగారు. దీంతో వలసదారులంతా భయపడి పోయి కేజ్రీవాల్ ఓటమి ఖాయం అయిందని గ్రహించి బిజెపికి ఓటు వేశారు.. బిజెపి దగ్గర కాస్త సానుకూలత సాధిస్తే మేము ఇక్కడే ఉండొచ్చని వాళ్ళు గ్రహించి  ఓట్లు వేశారని, ఇదే బిజెపి గెలుపుకు కారణమైందని  పార్థసారధి పొట్లూరి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: