![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/undavalli-arun-kumar-ycpdb4c35ed-58af-4cd4-9a73-8ac996b45810-415x250.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు.... ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్... వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో... వైసిపి నేతలు వార్తలు తెగ ప్రచారం చేస్తున్నారు. ఈనెల 26వ తేదీన... జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో సభ నిర్వహించబోతున్నారట.
బెంగళూరు నువ్వు వదిలి ఇక ఏపీలోనే సెటిల్ కాబోతున్నారట జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈనెల 26వ తేదీన సభ పెట్టబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సభలోనే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఈ విషయంపై ఉండవల్లి అరుణ్ కుమార్ కు సంబంధించిన అనుచరులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి చాలా రోజులు అయిపోయిందని చెప్తున్నారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని కొంతమంది అనుచరులు వెల్లడిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజానాద్ వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇలా పాత కాంగ్రెస్ నేతలు అందరూ... ఇప్పుడు వైసీపీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా... వైసిపి లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది.