![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/donald-trump132c7ffa-41be-41f7-9a9b-9009fb4f570d-415x250.jpg)
చైనా అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నా, ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచాన్ని శాసించే సంస్థగా చెప్పుకునే ఐక్యరాజ్యసమితి, ఇప్పుడు ట్రంప్ ఆజ్ఞలకు తలొగ్గుతుందా అని కొందరికి అనిపించవచ్చు. కానీ నిజం వేరు. ఐక్యరాజ్యసమితి ఎవరికీ లొంగదు. 193 దేశాల సభ్యత్వం ఉన్న ఆ సంస్థకు అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి.
కానీ ట్రంప్ కొడుతున్న దెబ్బలు మామూలుగా లేవు. డైరెక్ట్‌గా లొంగకపోయినా, పరోక్షంగా ఐక్యరాజ్యసమితిని కుదేలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) మీద ఆంక్షలు విధించారు. పర్యావరణ విభాగం ఫండింగ్ ఆపేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో తెగతెంపులు చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఐక్యరాజ్యసమితి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లే కనిపిస్తోంది.
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలకు అమెరికానే పెద్ద దిక్కు. సగానికి పైగా నిధులను అమెరికానే సమకూరుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఆ నిధులపైనే గురిపెట్టారు. డబ్బు ఆపేస్తే, ఐక్యరాజ్యసమితి ఎలా పనిచేస్తుంది? ప్రపంచ శాంతి, ఆరోగ్యం, పర్యావరణం వంటి కీలకమైన విషయాలపై దృష్టి సారించే ఈ సంస్థలు నిధులు లేక మూతపడితే, దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు?
ట్రంప్ దూకుడు ఇలాగే కొనసాగితే, ఐక్యరాజ్యసమితి ఉనికికే ప్రమాదం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ గండం నుంచి ఐక్యరాజ్యసమితి ఎలా బయటపడుతుందో చూడాలి. ట్రంప్ మస్క్ లాగా చాలా సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు మస్క్ ఆయన వెనుక ఉన్నారని సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకుని నిర్ణయాల్లో సగం మస్కు ఇచ్చినవే అని చాలామంది భావిస్తున్నారు.