![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/kiran-royal9958eca1-6514-48cf-93cd-3a28264c561c-415x250.jpg)
తాజాగా తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్... లీలలు బయటపడిన సంగతి తెలిసిందే. ఓ అమాయక మహిళను బెదిరించి.. ఆమెను వాడుకొని కోటి రూపాయల వరకు వసూలు చేశాడట కిరణ్ రాయల్. స్వయంగా ఈ విషయాన్ని బాధిత మహిళ ఓ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ బాధితురాలు వీడియో వైరల్ అవుతూనే ఉంది.
అయితే ఈ వివాదం మరువకముందే... నిజం చెప్పాలంటే 24 గంటలు దాటకముందే కిరణ్ రాయల్ బాగోతం మరొకటి బయటకు వచ్చింది. ఓ మహిళతో... బెడ్రూంలో ఉన్న కిరణ్ రాయల్ వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను వైసిపి సోషల్ మీడియా తెగ వాడుకుంటుంది. బెడ్ రూమ్ లో ఓ మహిళతో.... సాన్నిహిత్యంగా ఉన్న కిరణ్ రాయల్... ఆమె తీసుకువచ్చిన గోల్డ్ చైన్ కూడా మెడలో వేసుకున్నాడు. అలాగే ఆమెతో రొమాంటిక్ గా మాట్లాడుతూ.. ఈ వీడియోలో కనిపించాడు కిరణ్ రాయల్.
అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసిపి పార్టీ నేతలు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మహిళలతో ఆడుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాటలోనే జనసేన నాయకులు కూడా నడుస్తున్నారని... సెటైర్లు పేల్చుతున్నారు వైసీపీ నేతలు. అయితే... ఈ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియదు కానీ... ఆమె ముఖం మాత్రం క్లారిటీగా కనిపించింది. మరి ఈ వీడియో పై జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఎలా స్పందిస్తారో చూడాలి.