![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ys-jan-ex-cm-mahila-thadepallye0915ba9-7fad-43d8-8866-29c4c5377e30-415x250.jpg)
దీంతో ఈమె హడావిడితో బాపట్ల ప్రాంతానికి చెందిన సిద్ధారపు అంజయ్య రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన వ్యక్తిగత సిబ్బందికి అందించారట. వైసీపీ గ్రీవెన్స్ సేల్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి నాగ నారాయణ మూర్తి ఆమెను తీసుకొని మరి తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉంటున్న నివాసంలో జగన్ తో ఫోటో దిగి మరి పంపించారట. ఆ తర్వాత బయటికి వచ్చిన ఆమె సరికొత్త ట్విస్ట్ ని సైతం తెర లేపేలా చేసింది.
అయితే తనకు అప్పులు ఉన్నాయని అందుకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాలి అంటూ మళ్ళీ కోరుతూ ఇంటిముందు ఉండిపోయిందట.ఎంత చెప్పినా కూడా ఒప్పుకోకపోవడంతో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని దగ్గరలో ఉండే పోలీసులకు అందించారట. దీంతో సిఐ కళ్యాణ్ రాజు కూడా అక్కడికి చేరుకొని మరి ఆ మహిళ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అనంతరం పూర్తి వివరాలు సేకరించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మరి పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అభిమానం అనే పేరు చెప్పి మరి ఫోటో కోసం ప్రయత్నించడం ఆ తర్వాత మళ్లీ తనకు అప్పులు ఉన్నాయి తీర్చాలని సదరు మహిళ తీరు పైన కొంతమంది స్థానికులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.