పదేళ్లుగా ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన అమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికలలో మాత్రం ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దేశ రాజధాని పగ్గాలు కూడా బిజెపి పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయానికి కూడా అడ్డుకట్టు వేయడం జరిగింది. గత రెండుసార్లు ఎన్నికలలో AAP పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. అయితే ఈసారి మాత్రం అక్కడ గ్యారెంటీ ల పైన నమ్మకం కనిపించకపోవడంతో బీజేపీ పార్టీ వల్లే తమ రాత మారుతుందని అక్కడి ప్రజలు నమ్మకం కుదరడంతో చీపురు పార్టీకి మొదటిసారిగా ఓటమి చవిచుసేలా చేశారు.


ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఓటమి పైన మొదటిసారి స్పందించారు.. ప్రజల ఆదేశాన్ని తాము శిరసావహిస్తాము అని పూర్తి వినయంతోనే అంగీకరిస్తున్నామంటూ.. అలాగే విజయం సాధించిన బిజెపి పార్టీకి ధన్యవాదాలు అంటూ తెలిపారు గత పదేళ్లుగా ఢిల్లీ ప్రజల కోసం తాము చాలానే చేసాము.. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కూడా చాలా కృషి చేశాము ప్రజాసేవ కోసమే తాము రాజకీయాలలోకి వచ్చామంటూ తెలిపారు.


ప్రతిపక్ష హోదాలో తమ పాత్రను పోషిస్తామని అలాగే ప్రజల మధ్య ఉంటూ వారికి సేవ చేస్తూ ఉంటామని తెలిపారు. ఎన్నికలలో పోరాడిన ప్రతి ఒక్క ఆప్ నేతకు కార్యకర్తకు కూడా ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారమే బిజెపి పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఘనవిజయాలను అందుకున్నది. ముఖ్యంగా బీజేపీ పార్టీ మేనిఫెస్టో ఓటర్ల పైన తీవ్రమైన ప్రభావాన్ని కూడా చూపించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అవినీతి మరకలు, కుంభకోణాలు అనేవి ఆప్ పార్టీకి శాపంగా మారాయి. మరి ఏ మేరకు బిజెపి పార్టీ ఢిల్లీలో అభివృద్ధి పనులను చేసి ప్రజల చేత ప్రశంసలు అందుకుంటుందో చూడాలి. ఇటీవలే మోదీ కూడా ఢిల్లీ రూపురేఖలను కూడా మారుస్తానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: