ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికలలో వైసీపీకి ఘోర‌ పరాజ‌యం ఎదురైంది. 2014 ఎన్నికలలో జిల్లాలో వైసిపి ఓడిపోయిన కూడా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకుని తన హవా చాటుకుంది. నరసరావుపేట - మాచర్ల - గుంటూరు తూర్పు - మంగళగిరి - బాపట్ల నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి గుంటూరు పశ్చిమం - రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం మిగిలిన అన్ని నియోజకవర్గాలలో వైసీపీ జెండా రెపరెపలాడింది. గత ఎన్నికలలో జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటు స్థానాలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు చిత్తు గా ఓడిపోయారు. ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్కు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. పార్టీ నుంచి పలువురు కీలక నేతలు .. మాజీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు. మరి కొంతమంది అదే బాటలో ఉన్నారు. పలు నియోజకవర్గంలో వైసిపి పూర్తిగా బలహీనపడింది. జ‌గ‌న్ సైతం ఏం చేయ‌లేని ప‌రిస్థితి.


మరి ముఖ్యంగా గుంటూరు పశ్చిమం - పొన్నూరు - ప్రత్తిపాడు - తాడికొండ - మంగళగిరి - వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసిపి బాగా వీక్ అయిపోయింది. అసలు ద్వితీశ్రేణి నాయకులు ఎవరు వైసీపీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. వైసీపీ తరఫున చిన్న చిన్న కార్యక్రమాలు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిగా అక్కడ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2019లో వైసీపీని గెలిపించి తప్పు చేశామన్న భావనకు ప్రజలు వచ్చేసారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లపాటు అక్కడ అభివృద్ధి పూర్తిగా కుంటుపడి ప్రజల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి. ఎప్పుడు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ఇక్కడ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.


ప్రజల జీవన ప్రమాణాలు ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తాము వైసీపీని గెలిపించడానికి ఎంత మాత్రం న‌మ్మ‌కంగా లేవని ఓపెన్ గానే చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసిపి బాగా వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోను ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: