ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ పార్టీ బలోపేతానికి మళ్లీ చర్యలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ పార్టీ... ఇప్పుడు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన వారి స్థానాలలో... ఉన్న లీడర్లను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 ఇందులో భాగంగానే విజయ సాయి రెడ్డి... పదవిని మరో కీలక నేతతో భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. వైసీపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా, అలాగే పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్నట్లుగా విజయసాయిరెడ్డి ఎదగడం జరిగింది. అయితే అలాంటి పెద్ద స్థాయి లీడర్ బయటికి వెళ్లడం ఇటీవల మనం చూసాం.


అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో కాస్త డీలపడ్డ వైసిపి పార్టీలో మళ్లీ ఊపు తెచ్చేందుకు.. జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే.... మరో ఫైర్ బ్రాండ్ నేతను విజయసాయిరెడ్డి స్థానంలో తీసుకురావాలని అనుకుంటున్నారు. అది కూడా మాజీ మంత్రి పేర్ని నానిని... విజయ సాయి రెడ్డి స్థానంలో భర్తీ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు కూడా పేర్ని నానికి అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట.

 మరో రెండు రోజుల్లో పేర్ని నానికి సంబంధించిన అప్డేట్ రాబోతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే.... వైసిపి పార్టీ అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.... పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి... ఇప్పుడు... వ్యవసాయం చేసుకుంటున్నారు సాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: