- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏలూరు జిల్లాలో వైసిపి పరిస్థితి రోజురోజుకు బాగా దిగజారుతుంది. 2019 ఎన్నికలలో ఏలూరు జిల్లాలోని ఏలూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలలోను వైసిపికి అసలు తిరుగులేకుండా పోయింది. అయితే గత ఎన్నికలలో పార్టీ ఘోర ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఏలూరు పార్లమెంటు స్థానంతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోను కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కైకలూరులో బిజెపి ... పోలవరం - ఉంగుటూరు లో జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంటు స్థానంలో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికలలో ఓటమి తర్వాత మాజీ మంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు.


దెందులూరు లో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి రాజకీయాలకు దూరంగా విదేశాలలోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఉంగుటూరులో పుప్పాల వాసబాబు అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు తప్ప యాక్టివ్గా లేరు. ఉన్నంతలో చింతలపూడి - పోలవరం - నూజివీడులో మాత్రమే పార్టీ కాస్తో కూస్తో యాక్టివ్గా కనిపిస్తోంది. కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన దూకుడుగా రాజకీయం చేయడం లేదు .. ఆయన వల్ల జిల్లాలో పార్టీకి ఎంత మాత్రం ఉపయోగం లేదన్న చర్చలు కూడా సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గత ఎన్నికలకు ముందే తాను పోటీ చేయను అని చెప్పేశారు. ఎంపీగా ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత ఏమాత్రం ఆసక్తిగా ఉండటం లేదు .జడ్పీ చైర్మన్ దంపతులు సైతం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు. మరికొందరు నేతలు సైతం వైసీపీకి భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చి పక్క చూపులు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: