![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/kiran-royal-pawan-kalyan-tirupathi-lakshmiebcf626b-5d83-4d09-974e-063c14dde621-415x250.jpg)
అయితే 10 సంవత్సరాల క్రితం సెటిల్మెంట్ అయిపోయిన ఈ విషయం పైన ఇప్పుడు రాజకీయం చేస్తున్నారనే విధంగా జనసేన నేతలు తెలియజేస్తున్నారు. అలాగే తన పైన ఫిర్యాదు చేసిన బాధితురాలు వెనక ఎవరో ఉన్నారని అందువల్లే ఆమె ఫిర్యాదు చేసిందనే విధంగా కిరణ్ రాయల్ తెలుపుతున్నారు. వైసీపీ నేతలతో గత నాలుగు రోజుల నుంచి లక్ష్మి టచ్ లోనే ఉందంటూ తెలుపుతున్నారు కిరణ్ రాయల్.. అయితే కిరణ్ రాయల్ పైన వస్తున్న ఆరోపణల పైన పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఒక కమిటీ వేసి ఆదేశించారట.
ఈ విచారణ పూర్తి అయ్యేవరకు కిరణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారట.లక్ష్మి అనే మహిళ గత మూడు రోజుల క్రితం ఒక సెల్ఫీ వీడియోతో కిరణ్ రాయల్ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని కోటికి పైగా నగదు 25 సవర్ల బంగారం కాల్ చేసి తనని ఆర్థికంగా ఇబ్బందులలోకి నెట్టేశారనే విధంగా తెలిపింది. ఇక కిరణ్, లక్ష్మీ వాళ్ళ ఇంటికి వెళ్లినట్లుగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ కిరణ్ రాయల్ మాత్రం తన పైన వస్తున్న ఈ ఆరోపణలకు పై వైసీపీ హస్తం ఉందంటూ ఆరోపిస్తున్నారు.