వైసీపీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గ పులివెందులకు దూరం జ‌రగాల్సిన పరిస్థితులు రాబోతున్నాయా ? జగన్ పులివెందులను పక్కనపెట్టి ఉమ్మడి కడప జిల్లాలో జమ్మలమడుగు లేదా కమలాపురం లేదా మరో అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందా ? అంటే ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలలో అవును అన్న చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన అని చర్చి నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభ జ‌న‌ జరగనుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడు కొత్తగా మరో 50 నియోజకవర్గాలు ఏర్పడిన ఉన్నాయి. అంటే మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏర్పడతాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా రెండు అసెం బ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఈసారి రిజర్వేషన్లు కూడా మారనున్నాయి.


ఈ క్రమంలోనే జనరల్గా ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఈసారి ఎస్సీ కేటగిరీ లోకి మారుతుందని అంటున్నారు. అలా మార్చేలా కూటమి ప్రభుత్వ పెద్దలు పై స్థాయిలో చక్రం తిప్పుతారని కూడా అంటున్నారు. అదే జరిగితే పులివెందుల ఎస్ సీల‌కు రిజర్వ్ అవుతుంది. అప్పుడు జగన్ పులివెందులను పక్కనపెట్టి అయితే జమ్మలమడుగు లేదా కమలాపురం నియోజకవర్గాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పులివెందుల తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో వైయస్ ఫ్యామిలీకి వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ పార్టీలతో సింబల్ తో సంబంధం లేకుండా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసిన 30 వేల ఓట్లు ఈజీగా పడతాయని గతంలోనే అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థి హోదాలో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తమ ఫ్యామిలీ కంచుకోట అయిన పులివెందులను వదులుకోవడం వైయస్ ఫ్యామిలీకి ఎంతైనా ఇబ్బందికరమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: