- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

నారా లోకేష్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి .. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పగ్గాలు చేపట్టడంతో పాటు ఆ పార్టీ తరఫున భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి. అలాంటి నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి అయ్యారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ అయ్యారు. చంద్రబాబు తన కుమారుడికి అన్ని పదవులు ఇచ్చిన కూడా 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదువేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి పార్టీని ఎలా నడుపుతాడు ? అతడికి ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదని చాలామంది విమర్శలు చేశారు. అలాంటి లోకేష్ ఎంతో కష్టపడి రాటు తేలారు. యువ‌గ‌ళం పాదయాత్రతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం తిరిగారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఏకంగా 92,000 భారీ మెజార్టీతో విజయం సాధించారు.


ఎక్కడ అయితే ఓడిపోయారో అక్కడే ఐదేళ్లలో తిరిగి ఆ స్థాయిలో మెజార్టీ సాధించడంతో పాటు ఏమిటో నిరూపించుకున్నారు. ఇప్పుడు లోకేష్ మంత్రిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బలంగా పాతుకుపోయారు. మరి ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలో ఉండి తాను ఎమ్మెల్యేగా లేకపోయినా గత ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ చేసిన పనులు నియోజకవర్గ ప్రజలను ఎంతో ఆకర్షించాయి. తమ లోకేష్ ని ఓడించి చాలా తప్పు చేశామని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు భావించారు. అందుకే ఎన్నికలలో ఏకంగా 92,000 భారీ మెజార్టీతో ఘనవిజయం కట్టబెట్టారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో మంగళగిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో లోకేష్ అభివృద్ధి పనులు చేపట్టారు. నుంచి ఎవరు పగ్గాలు చేపట్టేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఏది ఏమైనా జగన్ మంగళగిరిలో లోకేష్ ను గట్టిగా టార్గెట్ చేయాలని చేసిన ప్రయత్నంతో లోకేష్ మరింత రాటు తేలి మంగళగిరి తన కంచుకోటగా మార్చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలో లోకేష్ ను టచ్ చేయటం ఎవరివల్ల సాధ్యం అయ్యేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: