![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/mpb0ce114c-efa1-47bc-8ae3-58226be7126e-415x250.jpg)
వైసీపీలో ఎంపీ పదవి అంటేనే ఒక వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చేసారు దాదాపు అందరూ నేతలు. వైసిపి ఆవిర్భావం నుంచి కూడా చాలామంది నేతలు ఎంపీలుగా పోటీ చేశారు. కొందరు లోక్సభ ఎంపీలు అయితే .. మరికొందరు రాజ్యసభ ఎంపీలు అయ్యారు. అయితే వీరిలో విజయ సాయిరెడ్డి - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతల మినహా మిగిలిన ఎంపీలు అందరూ రాజకీయంగా ఏమాత్రం ప్రాధాన్యత లేక పూర్తి డమ్మీ నేతలుగా మిగిలిపోయారు. చాలామంది ఎంపీలుగా కనీసం తమ నియోజకవర్గాలలో కూడా ఏమాత్రం చెప్పుకోదగ్గ ముద్ర వేయలేకపోయారు. కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేక పోయారు. అసలు వైసీపీలో ఎంపీ పదవి అంటే పెద్ద వేస్ట్ అన్న నిర్ణయానికి అందరూ వచ్చేశారు. కనుమూరి రఘురామ కృష్ణంరాజు - లావు శ్రీకృష్ణదేవరాయలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు వైసీపీ ఎంపీలుగా గెలిచి అక్కడ పూర్తి డమ్మీలుగా మారిపోయాం అన్న ఆవేదనతో పార్టీ మారి టిడిపి నుంచి విజయం సాధించారు.
అలాగే వల్లభనేని బాల శౌరి వైసిపి ఎంపీగా పూర్తి డమ్మీ అయిపోయాం అన్న బాధతో జనసేన లోకి వచ్చి ఎంపీ అయ్యారు. ఇక వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వారు సైతం పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవి వదులుకుంటున్నారు. వరుస పెట్టి తమ ఎంపీ పదవి కూడా వదులుకొని కూటమి పార్టీలలోకి వచ్చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఎంపీలు వైసీపీ నుంచి బయటకు వచ్చేయడంతో పాటు తమ ఎంపీ పదవి కూడా వదులుకుంటున్నారు. కోటగిరి శ్రీధర్ లాంటి నిజాయితీగల ఎంపీ పరిస్థితి అర్థం చేసుకుని మొన్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. భవిష్యత్తులోనూ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపరు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.