![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycp13c53a7b-062c-48d8-9e82-0136605a25c1-415x250.jpg)
గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీమంత్రి కొడాలి నాని .. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్ లో ప్రతిపక్షాలపై రెచ్చిపోయేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఆయన తనయుడు ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ తో పాటు .. జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులపై కొడాలి నాని - వంశీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయేవారు. మాటల తూటాలు పేల్చేవారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేవారు. కొడాలి నాని వైసిపి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ... వంశీ 2019 ఎన్నికలలో రెండోసారి టిడిపి నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. అలాంటి ఇద్దరు నేతలు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గుడివాడ - గన్నవరంలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
ఎన్నికలలో ఓటమి తర్వాత ఇద్దరు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వంశీ - నాని అధికార పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలతో పాటు జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్టు మాటల తూటాలు పేల్చారు. చివరకు వంశీ అయితే చంద్రబాబు భార్య భువనేశ్వరి పై సైతం దారుణ మైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ... కూటమి ప్రభుత్వ పెద్దలు వంశీ - నానిని టార్గెట్ చేసుకొని కాచుకుని ఉన్నారు. వీరిద్దరూ ఎక్కడ దొరుకుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో ఏ మాత్రం మాట తూలినా రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వీరిద్దరిని అదిని చూసి దెబ్బ కొట్టేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వంశీ - నాని ఆందోళనతో సైలెంట్ గా ఉన్నారని చర్చలు కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.