![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/-chandrababu2804e4bb-04d1-4426-8ceb-a80224a5bb52-415x250.jpg)
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అప్రతిహత విజయం సాధించింది. 11 ఏళ్లపాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని గద్ది దించిన బిజెపి ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీలో బిజెపి గెలుపు ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతుందా ? అంటే జాతీయ రాజకీయ వర్గాలు సైతం అవుననే అంటున్నాయి. వాస్తవానికి గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజార్టీ రాలేదు. మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీ పై ఆధారపడి బిజెపి కేంద్రంలో మనుగడ సాగిస్తోంది. ఈ టైంలో మహారాష్ట్ర తో పాటు ఢిల్లీలో బిజెపి విజయం సాధించింది. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి ఓడిపోతే ఆంధ్ర ప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలపై బిజెపి మరింతగా ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఢిల్లీలో గెలుపు తర్వాత బిజెపి కి జాతీయ రాజకీయాలలో మరింత పట్టు పెరిగినట్టు అయింది.
ఈ క్రమంలోనే ఏపీ లో తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తు లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మరిన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈసారి జనసేన - బిజెపి నుంచి సీట్లు పదవులు పంపిణీ విషయంలో చంద్రబాబుపై మరింత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే చంద్రబాబు ఏదోలా కేంద్రాన్ని ఒప్పించి భారీ స్థాయిలో నిధులు తెచ్చుకుంటున్నారు. ఇలా వరుస పెట్టి పలు రాష్ట్రాలు బీజేపీ చేతుల్లో పడుతుంటే కేంద్రం ఇక ఇప్పటి వరకు ఏపీకి నిధులు ఇచ్చినట్టు భవిష్యత్తు లో కూడా ఇస్తుందా ? అన్న సందేహాలు అయితే అందరి లోనూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.