![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/peddireddy-bjp-tdp-kutami-ap-politics-eenadub249a849-4541-4b6b-a77d-d80d6665034b-415x250.jpg)
అలాగే చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కబ్జా చేసినట్లు కూడా ప్రభుత్వం ఆరా తీసింది. దీనికోసం ప్రత్యేక నివేదిక రెడీ చేయాలని విజిలెన్స్ అధికారులను పంపింది కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి భూ కబ్జాలపై... ఆరా తీసింది విజిలెన్స్ అధికారుల బృందం. అయితే వీళ్ళ రిపోర్ట్ లో 14 ఎకరాలు అటవీ భూమిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కబ్జా చేసినట్లు తేలినట్లు సమాచారం అందుతుంది. వాస్తవంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 23.69 ఎకరాలు మాత్రమే... ఉన్నట్లు తెలిపిన అధికారులు... 104 ఎకరాలను కబ్జా చేసినట్లు లెక్కలు తేల్చారు.
అడవి భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ 104 ఎకరాలకు కంచ కూడా వేసుకున్నాడట పెద్దిరెడ్డి. ఈ 104 ఎకరాలను ర... తన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యుల పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. దీనికి సంబంధించిన రిపోర్టును ఏపీ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు అప్పగించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి పెద్దిరెడ్డి కుటుంబం పైన కేసు పెట్టే ఛాన్సులు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అవసరమైతే పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అలాగే ఇప్పటికే పెద్దిరెడ్డిపైనా చాలా కేసులు పెట్టింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఆయన సొంత నియోజకవర్గం కు వెళ్లకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అటు మిథున్ రెడ్డి పైన కూడా చాలాసార్లు కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఈ తరుణంలోనే ఆయన బిజెపిలోకి వెళ్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాను వైసీపీలోనే ఉంటానని ఇప్పటికే ప్రకటించారు పెద్దిరెడ్డి.