ఎంతో ఉత్కంఠ గా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది .. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా 48 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించింది .. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ తిరిగి అధికారం చేపట్టింది .. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీని 22 సీట్లకే పరిమితం చేసారు అక్కడి ప్రజలు.  గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీని సింగల్ డిజిట్ కు కాంగ్రెస్ ను జీరోకు పరిమితం చేసి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న కేజ్రీవాల్ ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని అందుకున్నారు .. పార్టీని గెలిపించుకోవడమే కాదు తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు .. ఇప్పుడు ఢిల్లీ విజయం గురించి దేశమంతా మాట్లాడుతుంది .. అలాగే ఢిల్లీ రిజల్ట్ ఎఫెక్ట్ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం మీద పడే అవకాశం కూడా ఉంది .. ఎక్కడో జరిగిన ఘటన మరెక్కడో జరిగే ఇంకో పనిపై ప్రభావం చూపుతుంది .. దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు .. రాజకీయాల్లో పక్కాగా కనిపించే ఫార్ములా ఇది .. ఢిల్లీ ఇచ్చిన జోష్టో మిగిలిన రాష్ట్రాలపై బీజేపీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉండబోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు .. నార్త్ లో దాదాపు బిజెపి క్లీన్ షిప్ అన్ని రాష్ట్రాల్లోనూ కమలనాథులదే అధికారం.


ఇక దక్షిణాదిలో ఒక్క కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలు బిజెపికి పెను సవాల్గా మారాయి . అయితే ఇప్పుడు హర్యానా , మహారాష్ట్ర , ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలతో .. సౌత్ రాష్ట్రాల మీద కూడా బిజెపి కన్ను పడే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి .. అదే చేస్తే కమలం పార్టీ మొదటి టార్గెట్ తెలంగాణ కావటం ఖాయం.. సౌత్ రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలతో చూస్తే తెలంగాణలో బిజెపి కొంత బలంగా ఉంది.  నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందని అంతా అనుకున్నారు.. కమలం పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాలతో బీజేపీని ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితం చేశాయి .. ఇక ఇప్పుడు ఢిల్లీ ఇచ్చిన జోష్ తో తెలంగాణలో బిజెపి చక్రం తిప్పడం ఖాయం .  అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కమలం పార్టీదే అని ఇప్పటికే ఆ పార్టీ నేతలు కేంద్రమంత్రి బండి సంజయ్ లాంటి వాళ్లు కూడా ప్రకటనలు చేస్తున్నారు .. అలాగే తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిజెపి పోటీకి సై అంటుంది .. అలాగే ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రేటర్ ఎలక్షన్స్ ఇలా ప్రతి ఎన్నికను.. వచ్చే ప్రధాన ఎన్నికలకు అవకాశం గా మార్చుకుని గ్రౌండ్ లెవెల్ లో మరింత బలం పెంచుకోవాలని .. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి అధికారమే లక్ష్యంగా దూసుకుపోవడానికి బీజేపీ ప్లాన్ వేస్తుంది.


ఇక దీనికోసం ఢిల్లీ స్టేట్ జీని మరోసారి తెలంగాణలో అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది .. బూత్ స్థాయి నుంచి టార్గెట్ చేసిన బీజేపీ ఢిల్లీలో ఊహించని ఘన విజయం అందుకుంది .. ఇక ఇప్పుడు తెలంగాణలోను అదే స్టాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .. వీటన్నిటికీ తోడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బిజెపి దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు , కేసులు ఉండనే ఉన్నాయి .. అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పరాభవం వెనుక లిక్కర్ స్కాం ప్రధానం పాత్ర పోషించింది .. అలాగే కేజ్రీవాల్ ఇమేజ్ను సగానికి పైగా పోగొట్టింది ఈ కేసులే .. అలాగే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు మరింత దూకుడు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి .. ఇక ఇప్పుడు అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కూడా మరింత ప్రకంపనలు రావటం ఖాయం .. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఈ కేసు ఓపెన్ చేస్తే.. కారు పార్టీకి మరోసారి చుక్కలు కనిపించే అవకాశం ఉంది .. ఇదే జరిగితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం బిజెపికి రావొచ్చు అనేది కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షాల ఆలోచన..

మరింత సమాచారం తెలుసుకోండి: