![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/modi-delhi-bjp-win-manipostdec47730-38a6-441f-b179-26fa2b77fadf-415x250.jpg)
రాజధాని ఢిల్లీలో 70 స్థానాల అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఇటీవల జరగగా ఇందులో 48 స్థానాలను బిజెపి స్పష్టమైన మెజారిటీతో గెలవడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నెరవేర్చుకునే పనిలో పడింది.
1).పేద మహిళలకు ప్రతినెలా కూడా రూ .2500
2). హోలి దీపావళి వండి పండుగలు సమయాలలో ఉచిత గ్యాస్ సిలిండర్స్.
3). అలాగే ప్రతి పేద మహిళలకు కూడా రూ.500 రూపాయలకే వంటగ్యాస్
4). గర్భిణీ స్త్రీలకు రూ.21 వేల ఆర్థిక సహాయం
5). ఢిల్లీలో 1700 కి పైగా అనధికార స్థావరాలలో నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా తమ ఇల్లు యాజమాన్య హక్కులను సైతం అందిస్తుందట.
6). ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు ఉచితంగా అందిస్తుందట.
7). గిగ్ కార్మికులు వస్తా కార్మికులకు రూ .10 లక్షల రూపాయల బీమాను కూడా అందిస్తుందట.
8). అలాగే పోటీ పరీక్షలలో సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థులకు కూడా రూ .15 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందట.
9). షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన ప్రతి విద్యార్థికి కూడా ప్రతి నెల రూ .1000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందట.
బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ హామీలను మరి బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనే విషయం కోసం ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు.