తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరహాలో.. తెలంగాణలో కూడా రాజకీయాలు భిన్నంగా మారాయి. మొన్నటి వరకు అల్లు అర్జున్ చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరిగిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో... చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ సంధ్యా థియేటర్లో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లడం జరిగింది.


 ఈ సంఘటన... ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.  అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి... ఫిర్యాదు చేయడం జరిగింది.  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

 తాజాగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణ పై ఒకసారి పునరాలోచన చేయాలని.. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొన్ని నెలల కిందట కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా కేబీఆర్ చుట్టూ ఉన్న ప్రముఖుల ఇండ్లు... కూల్చివేస్తారని ప్రచారం జరిగింది.

 ఇందులో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటితో పాటు నందమూరి బాలయ్య... మాజీ మంత్రి జానారెడ్డి ఇల్లు.. కూడా ఉండటం గమనార్హం. అయితే వీళ్ళు ఎవరు ఫిర్యాదు చేయలేదు కానీ... అల్లు అర్జున్ పైన కోపంతో తన ఇంటి పైకి వస్తాడని చంద్రశేఖర్ రెడ్డి ముందే ఊహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు అల్లు అర్జున్ మామ  చంద్రశేఖర్ రెడ్డి. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతకుముందు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: