![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/brs693d580f-98fa-46d5-ae51-4ae90c151054-415x250.jpg)
రాజీనామాకు మా నాయకుడు రేవంత్ రెడ్డి అవసరం లేదని తాను సిద్ధంగా ఉన్నానని...ఈ విషయమై తాను కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామాపైన కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు.
ఆరిపోయే దీపం లా కేటీఆర్ మాట్లాడుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ద్వజమెత్తారు. జైలుకు పోతామన్న భయంతోనే ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్ నుంచి మనుషులను తీసుకెళ్లి దారి పొడువునా కేటీఆర్ షో చేస్తున్నాడని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ యువతకు ఉపాధి కల్పించడం కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ దుష్పచారం చేసిందని ఆరోపించారు.
కలెక్టర్ ను చంపించడానికి సురేష్ అనే వ్యక్తితో విఫలయయత్నం చేయించారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. పారిశ్రామిక వాడ కోసం భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా లేఖలు ఇస్తున్నారన్న రామ్మోహన్ రెడ్డి ....భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లిస్తున్నామన్నారు. అసైన్డ్ భూములకు కూడా ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరించారు.