చిలుకూరు బాలాజి ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 7న రంజరాజన్ పై దాడి జరిగగా...8న అయన మోయినాబాద్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలసులు ప్రధాన నిందితుడు వీర్ రాఘ రెడ్డి అరెస్ట్ చేశారు.


నిన్న ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరు ఖమ్మం, నిజామాబాద్ కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు  వీర్ రాఘవ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పూరు కి చెందిన వాడని తెలిపారు. 2022లో వీర్ రాఘవ రెడ్డి రామ రాజ్యం అనే వెబ్‌ సైట్, సామాజిక మాధ్యమాల పేజ్ లను  ప్రారంభించిన వీర్ రాఘవ రెడ్డి...ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇతర సామాజి మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ తెలిపారు.


భగవద్గీత స్లోకాలతో రామ ఆర్మీలో చేరాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని పోస్టులు పెట్టినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ చేరేవారికి 20వేల జీతం ఇస్తానని కూడా ప్రచారం చేశాడని తెలిపారు. ఈ ప్రచారానికి స్పందించిన సుమారు 25 మంది తణుకులో అతన్ని కలిశారని....అక్కడ నాలుగు రోజులు ఉన్న అనంతరం కోటప్ప కొండకు వెళ్ళారని తెలిపారు.


అక్కడ ఒక్కొక్కరికి రూ.2వేలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోమని వీర్ రాఘవ్ రెడ్డి వారికి చెప్పాడని వివరించారు. యూనిఫామ్ సిద్దమయ్యాక ఈనెల 6న యాప్రాల్ లోని ఓ ఇంట్లో అందరూ కలిసి రామరాజ్యం బ్యానర్ తో ఫోటోలు వీడియోలు తీసుకుని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారని తెలిపారు. ఈ నెల 7న మూడు వాహానాల్లో చిలుకూరు వచ్చి రంగారాజన్ పై దాడికి పాల్పడ్డారన్నారు. రామ రాజ్యం ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడమే కాకుండా...ఆర్ధక సహయం చేయాలని బెదిరించి రంగారాజన్ పై దాడికి పాల్పడినట్లు రాజేంద్ర నగర్ డిసిపి శ్రీనివాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: