![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/malli-vallade-adikaram-antu-bandlaganesh-sanchalan-twitecde23ac8-8767-4b49-846c-f9397a33329c-415x250.jpg)
మరి ఈ ట్విట్ ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ పోస్ట్ చేసిన క్షణాలలోనే తెగ హల్చల్ చేస్తోంది."గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలవడం తప్పదు.. ఇది అనివార్యం అంటూ" వెల్లడించారు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో అటు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ ఓటమి కాబట్టి వాళ్ల విజయాలను గురించి బండ్ల గణేష్ ఇలా ట్వీట్ చేశారంటూ కూడా తెలియజేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ముందుకు వెళుతున్నారు.. ఇలా ఒక వైపు పార్టీలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటా అని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉండగా.. మరి కొంతమంది మాత్రం బండ్ల గణేష్ అన్న గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారనే విధంగా మాట్లాడుకుంటున్నారు.
ఇటీవలే ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఒక ఈవెంట్ లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపాయి.. ఈ వివాదం పైన అటు నటుడు నిర్మాత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.. అటు ఈ విషయం పైన కూడా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రాజకీయం , సినిమా అనేటువంటిది ఒకటిగా చూడకూడదు.. రాజకీయాలలో ఉన్నట్లు అయితే సినిమాలు చేసే నటీనటులు సైతం సినిమా వేదికల పైన రాజకీయాలు మాట్లాడకూడదని.. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తెలియజేశారు. వీరి యొక్క నోటి దూల వల్ల సినిమాలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటూ బండ్ల గణేష్ తెలిపారు.