- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . . .


పోయిన చోట వెతుక్కోవటం అన్నది రాజకీయాలలో ఉత్తమ లక్షణం. వైసీపీ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్ర కీలకం .. 2024 ఎన్నికలలో ఓటమి పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రభావం చూపించింది. వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అది కూడా అరకు ఒకటి పాడేరు. ఈ రెండు సీట్లు కూడా ఏజెన్సీలో ఉన్న వే కావ‌డం విశేషం. దీంతో వైసిపిని ఇక్కడ మళ్ళీ బలోపేతం చేసేందుకు జగన్ కార్యచరణ రెడీ చేస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్ర పగ్గాలు ఎప్పుడూ విజయసాయిరెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి చేతుల్లో పెట్టేవారు .. వారిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు. వారు పార్టీ పరంగా తమ పవర్ చూపించారే.. తప్ప ఉత్తరంధ్ర లో పార్టీని నిజంగా బలోపేతం చేసేందుకు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. విజయసాయిరెడ్డి పార్టీని వదిలి బయటకు వెళ్లిపోయారు.


ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి ఎవరు వస్తారా ? అన్న చర్చల నేపథ్యంలో ఒక అనూహ్యమైన పేరు తెరమీదకు వచ్చింది. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన పేర్ని నాని. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వైసీపీలో ఫై బ్రాండ్ లీడర్ గా పేరు పొందారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. జ‌గ‌న్ కు పేర్ని నాని న‌మ్మ‌క‌స్తుడు.. న‌మ్మిన బంటుగా ఉండేవారు. గ‌త ఎన్నిక‌ల్లో నాని పోటీ చేయ‌కుండా ఎన్నిక‌ల కు దూరంగా ఉన్నారు. త‌న త‌న‌యుడు పేర్ని కిట్టు ను రంగంలోకి దించారు. ఇక ఉత్త‌రాంధ్ర లో కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. నాని కూడా అదే వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఎలాగైనా ఉత్త‌రాంధ్ర లో పార్టీ త‌ర‌పున వ్యూహాలు రచిస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చేయాల‌ని జ‌గ‌న్ నానికి ఈ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్టు టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: