![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/telangana-liquor-shops-to-be-closed-till-december-stff967859-e53d-496d-9bc4-76c43e5bc44a-415x250.jpg)
తెలంగాణ రాష్ట్రంలో... కింగ్ ఫిషర్ బీర్లు ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ఆరు నూరైనా సరే కింగ్ ఫిషర్ బీర్లు తాగాలని... తెలంగాణ మందుబాబులు... నిత్యం అంటూ ఉంటారు. అయితే ఆ బీర్లను... బ్యాన్ చేసి కొత్త బీర్లను తెరపైకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీలో ఇలాగే చేసి.. ఎన్నికల్లో దెబ్బతిన్నారు. అందుకే ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం... ఈ విషయంలో వెనక్కి తగ్గింది.
కింగ్ ఫిషర్ బీర్లను అలాగే కొనసాగించి... ఎక్కువ లాభాలను పొందేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలను 15% పెంచుతూ... స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 15% బిర్ల ధరలు పెరగడంతో... మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం... లైట్ బీర్ 150 రూపాయల నుంచి 180 వరకు పెరుగనుంది. అంటే ఒక్కో బీరు పైన 30 రూపాయలు... ఇకపై అదనంగా చార్జ్ చేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో స్ట్రాంగ్ బీర్లు.. 160 రూపాయలు ఉండేవి. ఇకపై.. ఈ బీర్ల ధరలు 200 రూపాయలు కానున్నాయి. అయితే.. బీర్ల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్ జోలికి మాత్రం వెళ్ళలేదు. అయినప్పటికీ ధరల పెంపుతో.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క బీరు పైన దాదాపు 140 నుంచి 150 రూపాయలు లాభం రాబోతుంది. ఎండాకాలం సమయంలో బీర్లు విపరీతంగా సేల్ అవుతాయి. ఇలాంటి సమయంలో ధరలు పెంచి మందుబాబుల పొట్ట కొట్టిందని... జనాలు ఆందోళన చెందుతున్నారు.