ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి పలు రకాల కసరత్తులు చేస్తూనే ఉన్నది.. అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15 వేల రూపాయలు ఒక్కొక్కరికి జమ చేస్తామని చెప్పిన కూటమినేతలు తాజాగా ఈ పథకం గురించి ఇప్పటికి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తూ ఉన్న అమలు చేయలేదు వచ్చే విద్యా సంవత్సరానికి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ నిర్ణయించారు. దీంతో ఒక ఏడాది ఈ పథకం ఆగిపోయినట్టే.



కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి పలు నిబంధనలను కూడా కసరత్తు చేసే విధంగా ప్లాన్ చేస్తాందట. గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోంది. వైసిపి ప్రభుత్వం లో 15 వేల రూపాయలు ఇస్తూ ఉండేది. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ పథకానికి అర్హులైన తల్లుల ఖాతాలో డబ్బులను జమా చేయబోతుందట కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారుగా 81 లక్షలు మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారట. అయితే ఇందులో 69.16 లక్షల మంది మాత్రమే ఈ పథకానికి సైతం అర్హులుగా ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.


ఈ పథకం అమలు కోసం ప్రతి ఏడాది కూడా 10,300 కోట్ల రూపాయలు అవసరమవుతుందట. అలాగే విద్యార్థులకు 75% హాజరు నిబంధన ఉండడమే కాకుండా విధివిధానాలను కూడా అమర్చినట్లు తెలుస్తోంది.

1). ఆదాయ పన్ను చెల్లింపు దారులు
2). తెల్ల రేషన్ కార్డు లేనివారికి
3). 300 యూనిట్లు విద్యుత్ వినియోగించే వారికి
4). కారు కలిగిన వారికి.
5). వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్న ఇల్లు వారికి.. ఈ పథకం అందలేదట.


అయితే గతంలో విద్యుత్ వినియోగం ,కారు ఉండడం వంటి నిబంధనలను కూటమి ప్రభుత్వం వ్యతిరేకించింది. మరి ఇప్పుడు వారందరికీ ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: