![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/ycpac86d2c1-9108-45f6-8efb-dc5be4ada5a5-415x250.jpg)
ఇదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త గేమ్.. ప్లాన్ తో జనాల ముందుకు వస్తున్నాడు. ఏపీ కాంగ్రెస్ను ఖాళీ చేసి... వైయస్ షర్మిల కు బుద్ధి చెప్పే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగానే.. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత శైలజ నాథ్ కు వైసిపి కండువా కప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు మరో నలుగురు లీడర్లను... వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను... తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట జగన్. ఇందులో పెద్ద తలకాయలే ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రులు పల్లంరాజు, రఘువీరారెడ్డి అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ ఇలాంటి పెద్ద లీడర్లను.. పార్టీలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారట. వాళ్లతో పాటు లేడీ ఫైర్ బ్రాండ్ పద్మశ్రీ కూడా వైసిపి కండువా కప్ కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. షర్మిలకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఈ నేతలంతా రగిలిపోతున్నారట. అందుకే... ఈ నేతలంతా వైసీపీలోకి వచ్చి సెట్ కావాలని డిసైడ్ అయిపోయారట. మాజీ మంత్రులు పల్లంరాజు, రఘువీరారెడ్డి అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ తో పాటు పద్మ శ్రీ నలుగురు ఒకే రోజున వైసీపీ పార్టీలోకి రానున్నారట. ఈ తరుణంలోనే.. జగన్ కండువ కప్పనున్నారట.