- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీలో అంతర్గత‌ కుమ్మలాటలు జరుగుతున్నాయి. పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్న అంతర్గతంగా మాత్రం ఎత్తులు వేసుకుంటున్న పార్టీని నష్టపరుస్తున్నారు. ఉత్తరాంధ్ర లో ఈ కుమ్ములాటల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జిగా నిన్న మొన్నటి వరకు ఉన్న విజయసాయిరెడ్డి పార్టీని వీడారు. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జ్ ప‌ద‌వి ఖాళీ అయింది. ఈ పదవి కోసం మాజీ మంత్రి .. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి వై వి సుబ్బారెడ్డిని తప్పించినప్పుడే గుడివాడ అమర్నాథ్ పేరు తెరమీదకు వచ్చింది. ఇంతలోనే సాయి రెడ్డికి బాధ్యతలు ఇవ్వడంతో ఆయన కొన్నాళ్లు మౌనం పాటించారు. ఇప్పుడు సాయి రెడ్డి తనంతట తాను పార్టీ నుంచి బయటికి వెళ్లడంతో అమర్నాథ్ ఈ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


అయితే గుడివాడకు బాధ్యతలు అప్పగించే విషయంలో మరో మాజీమంత్రి ప్రసాద్ ఎమ్మెల్సీ  బొత్స‌ సత్యనారాయణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. గుడివాడకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇస్తే ఎక్కడ తన హవాకు బ్రేకులు పడతాయో అన్న ఆవేదన ఆందోళన బొత్స లో కనిపిస్తోంది. తనకంటే జూనియర్ అయిన గుడివాడకు పగ్గాలు ఇస్తే తన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది అని బొత్స‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా గుడివాడ విశాఖపట్నం లోకల్ కావడంతో బొత్స కు మరింత ఇబ్బంది కానుంది. అందుకే గుడివాడ ప్రయత్నాలకు బొత్స‌ గండి కొట్టుతున్నట్టు తెలుస్తోంది. బొత్స‌ను కాదని గుడివాడకు ఉత్తరాంధ్ర పగ్గాలు ఇచ్చిన నిత్యం తలనొప్పులు కాయం. ఈ నేపథ్యంలోని జగన్ ఈ ఇద్దరిని దూరం పెట్టి ఉమ్మడి కృష్ణకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్టీ కీలకనేత పేర్ని నానికి ఉత్తరాంధ్ర ఇన్చార్జి పగ్గాలు అప్పగించే దిశ‌గా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: