మిధున్ రెడ్డి ఏమన్నారంటే..
నిబంధనలకు పూర్తి విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించింది. ఆర్‌బీఐ ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.. మార్గదర్శి నగదు రూపంలో డిపాజిట్లు సేకరించింది. రూ. 1000 కోట్లపై ఆదాయపన్నుశాఖ విభాగం నోటీసు ఇచ్చింది. దీనిపై మార్గదర్శి కోర్టుకు వెళ్లింది. స్టే తెచ్చుకుంది. ఇది అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి. చట్టం ప్రతి ఒక్కరి విషయంలో ఒకేలా ఉండాలి. వారికి ఓ మీడియా హౌస్ ఉన్నంత మాత్రాన వదిలిపెట్టకూడదు.
ఈ విషయాన్ని నేను ప్రతిరోజూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తా.. వాళ్లు నా గురించి రోజూ వార్తలు రాస్తూనే ఉన్నారు.. వాళ్లేం రాసుకున్నా నేను పట్టించుకోను. ఈ విషయాన్ని మేం పెద్ద ఎత్తున తీసుకెళ్ళబోతున్నాం.. దీనిపై మేం పోరాడతాం. లక్షలాది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా మేం చూస్తాం.. ఇది సరైన విషయం కాదు.. కేంద్రం తన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నా.. ఈడీ ఎక్కడ ఉంది? సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంది? ఇంత చేసినా చర్యలు ఏవి?
నేను సభలో ఉన్న అందరికీ ఒక్కటే చెప్పదలచుకున్నా.. మీరు గూగుల్‌లోకి వెళ్లి మార్గదర్శి ప్రమోటర్ నేమ్ అని కొట్టి చూడండి. గూగుల్ మీకు నిజమైన బంగారు కుర్చీలో కూర్చున్న ఓ వ్యక్తి ఫోటో చూపిస్తుంది. మంత్రులు ఆయన ముందు మోకరిల్లతారు. దిసీజ్ హౌ ఎ స్కామ్‌స్టర్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ ద గవర్నమెంట్.. ఒక స్కామ్‌స్టర్‌ను ప్రభుత్వంలో ఎలా ప్రొజెక్ట్ చేశారో తెలుస్తోంది.. దీనిపై చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి.. ప్రజల సొమ్ముతో వారు ఇలా చేస్తున్నారు.. చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని మిధున్ రెడ్డి అన్నారు.