ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తలిగింది. వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసుల నోటీసులు అందాయి. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటీవలే జగన్‌ మోహన్‌ రెడ్డి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే... అగ్ని ప్రమాద ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని కోరారు పోలీసులు.


ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసుల నోటీసులు అందడం జరిగింది.  వైసీపీ పార్టీ కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనదారుల పేర్లు, వారి వాహనం నంబర్ల వివరాలు ఇవ్వాలని కూడా నోటీసులలో పోలీసులు పేర్కొనడం జరిగింది.  దీంతో పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను ఇవ్వాలని కోరారట పోలీసులు.


అన్నీ వివరాలతో ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని నోటీసులలో పోలీసులు పేర్కొనడం జరిగింది.  వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై 6న పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వైసీపీ పార్టీకి చెందిన కార్యాలయ వర్గ సభ్యులు. ఇదే ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ అందజేయాలని 7వ తేదీన ఓ నోటీసు ఇచ్చారు ఏపీ పోలీసులు.  


ఈ క్రమంలో ఆరోజున సీసీ కెమెరాలు పనిచేయక పోవటంతో సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకు లేఖ ఇచ్చారు వైసీపీ కార్యాలయ వర్గ సభ్యులు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యాలయానికి మరో నోటీసు ఇచ్చిన పోలీసులు.. అన్నీ వివరాలతో ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని ఆదేశించారు.  ఇప్పటికే వైసీపీ కార్యాలయ దగ్గర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఇవాళ స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: