- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ కీలక నాయకుడు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి తాజాగా ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. ఆయన తన ఎంపీ పదవితో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేశారు. సాయిరెడ్డి స్థానాన్ని ఎవరితోనూ ఎప్పటి వరకు భర్తీ చేయలేకపోయారు. సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి పది రోజులు దాటుతున్న ఆ స్థానంలో ఇంకా ఎవరిని ప్రకటించలేదు. ముఖ్యంగా రాజ్యసభలో వైసిపి పక్ష నాయకుడి స్థానం అత్యంత కీలకం .. అలాగే పార్లమెంటరీ పార్టీని ముందు నుంచి నడిపించే నాయకుడి గా కూడా సాయి రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీలోనూ పెద్ద నాయకులతో కలివిడిగా ఉంటూ వైసీపీ వ్యవహారాలు చక్కబట్టారు. దీంతో గడిచిన ఇన్నేళ్లలో వైసిపి ఢిల్లీలోను రాజకీయాలు చేసింది కానీ సాయి రెడ్డి పార్టీని వీడి వెళ్ళడంతో ఈ స్థానం ఎవరికి దక్కలేదు.


వాస్తవానికి సాయి రెడ్డి బాధ్యతలు చేసిన ఆయనకు అద‌నంగా దక్కిన సొమ్ములు కానీ ... అదనంగా అందిన జీతాలు కానీ ఏమీ లేవు. అయితే జాతీయ స్థాయిలో ఆయనకు మంచి ఇమేజ్ వచ్చింది. వైసీపీకి గతంలో 22 మంది ఎంపీలు ఉన్న ఇప్పుడు ఆ సంఖ్య తగ్గినా కూడా సాయి రెడ్డికి ఇమేజ్ మాత్రం పదిలంగా ఉండేందుకు ఆయన పదవులు కీల‌కం. దీంతోనే సాయి రెడ్డి జాతి స్థాయిలో నెట్టుకు వచ్చారు. ప్రధానితో పాటు అమిత్షా లాంటి కీలక నేతల దృష్టిలో పడ్డారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఆ స్థాయిలో ఢిల్లీలో రాజకీయాలు చేసేందుకు జగన్ ఎవరికి అవకాశం ఇస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది.


సాయి రెడ్డి లాగా దూసుకుపోయే నాయకులు చాతర్యంతో మాట్లాడే వారు జగన్ కు ఎవరు ? కనబడటం లేదు. ఇది ఎలా ఉంటే సాయి రెడ్డి స్థానం కోసం మరో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సాయి రెడ్డి ప్లేస్ ను తనకు ఇవ్వాలని అయోధ్య రామిరెడ్డి పరోక్షంగా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఆళ్ల కు కూడా ఢిల్లీ స్థాయిలో ఆది నుంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన కాంట్రాక్టు పనులు ... రాజకీయ పరిచయాలు నార్త్ బెల్ట్‌లో ఈదుకు రాగల భాషా నైపుణ్యం వంటివి ఉన్నాయి.. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: