![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ap-ycp-2-0-next-torget-verena-twite-viral7d331742-4035-4664-b130-a94ba45492c7-415x250.jpg)
అయితే ఆ తర్వాత ఒక మహిళా వ్యవహారం వల్ల జనసేన పార్టీకి దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ ని పార్టీని ప్రకటించడం జరిగింది. ఇటీవల నటుడు పృద్వి కూడా వైసీపీ 11 సీట్లు అంశాన్ని సైతం గుర్తు చేస్తూ సెటైరికల్ గా మాట్లాడడంతో.. ఒక్కసారిగా బైకాట్ లైలా సినిమా అనే హ్యష్ ట్యాగ్ ట్రెండీగా మారింది. ఏకంగా 86 వేల ట్వీట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఏకంగా హీరో విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే వైసీపీ సోషల్ మీడియాలో మరొక పోస్ట్ సంచలనం గా మారుతున్నది.
ఇప్పటివరకు కిరణ్ రాయల్ 2.O పూర్తి అయ్యారు త్వరలో సీమరాజకు సంబంధించి విషయాలు బయటకు రాబోతున్నాయని.. సీమరాజా లోడింగ్ అంటూ పోస్టులు పెట్టడమే కాకుండా గతంలో వైసిపి నాయకుడిగా చెప్పుకొని తిరిగి ఈయన పార్టీని తిడుతూ వీడియోలను షేర్ చేసేవారు. ఇక తర్వాత నెక్స్ట్ టార్గెట్ కిర్రాక్ ఆర్పీ.. వైసీపీ పైన పోస్టులు పెట్టడం జగన్ పైన ఎన్నో విమర్శలు చేయడంతో పాటు రోజా పైన చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత హైపర్ ఆది అంటూ చాలామంది ఉన్నారనే విధంగా ట్విట్ వైరల్ గా మారుతున్నది. మరి ఈ 2.O లో తర్వాత బయటికి వచ్చే పేర్లు ఎవరెవరో చూడాలి.