కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత కూటమిలోని చాలామంది నేతల వ్యవహారాలు రోజుకొకటి బయటికి పడుతూ ఉన్నాయి. గతంలో టిడిపి పార్టీకి చెందిన సీనియర్ నేత రాసలీలలు కూడా బయటికి వచ్చాయి..ఇటీవలే జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెదంచల గ్రామంలో టిడిపి మాజీ జడ్పిటిసి ఆయన సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పనిచేస్తున్న దివ్యాంగురాలు పైన చాలాసార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ బాధితురాలు కూడా గర్భం దాల్చినట్లు వెల్లడిస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల అన్నట్లుగా తెలియజేసింది.


ఈ బాధితురాలు తల్లిదండ్రులు హైదరాబాదులో ఉండడంతో ఈమె తన నానమ్మతో కలిసి పెదంచలలో వన్ టు జీవనాన్ని సాగిస్తూ ఉన్నదట. తన మనవరాలికి సైతం న్యాయం జరగాలి అంటూ ఆ బాధ్యత కుటుంబ సభ్యులను సైతం వెళ్లి నిలదీసిందట. దీంతో పెద్దల సమక్షంలో వరశి భాస్కరరావు రాజీ కుదిరించేందుకు సైతం ప్రయత్నాలు జరిగాయని వార్తలు వినిపించాయి. నేపథ్యంలోనే బాధితురాలు దగ్గరలో ఉండే పోలీసులను సైతం ఆశ్రయించిందట. తమకు జరిగిన ఈ అన్యాయం పైన ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సందర్భంగా బాధితురాలు నానమ్మ కూడా మాట్లాడుతూ.. తనకు గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాగా అప్పుడు వైద్యులు తన మనవరాలు గర్భవతి అంటూ తెలిపారని.. ఈ విషయం విన్న తర్వాత తన గుండె పేలినట్టుగా అనిపించిందని.. ఇందుకు కారణం టిడిపి నేత వరశి భాస్కరరావు తన మనవరాలని గర్భవతి చేశారంటు ఆమె ఆరోపణలు చేసింది. తమకు న్యాయం జరగాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీరు.. మరి ఏ మేరకు ఏ విషయం పైన టిడిపి నేత వరిశి భాస్కరరావు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: