ఇటీవలే రాష్ట్ర మంత్రులతో కార్యదర్శులతో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో  నిర్వహించినటువంటి సమావేశానికి సైతం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తుతున్న సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వ్యవహారం పైన జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ రెండు వారాలుగా చాలా తీవ్రమైన నడుము నొప్పితో అస్వస్థలు పడుతున్నారని తెలియజేశారు. అందుకే ఈ సమావేశానికి హాజరు కాలేదని రెండు మూడు రోజులలో విధులకు హాజరవుతారని వెల్లడించారు.



ఈ విషయం పైన సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని కానీ దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడగగా పర్వాలేదు అంటూ మనోహర్ వెల్లడించారట. ఈ సమావేశానికి సైతం చాలా మంది ప్రత్యేకమైన కార్యదర్శులనే సీఎం చంద్రబాబు పిలిచారట. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించి కార్యదర్శి మంత్రి పక్కనే కూర్చుని మరి మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే వారికి సంబంధించిన వాటికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారట. అలాగే మంత్రులకు సంబంధించి వారి పనులు చేయడానికి సమయాన్ని కూడా గుర్తించి మరి తెలియజేపారట.వారికి ఇచ్చిన సమయానికి మించి సమయం ఇవ్వరని వారు చేయాలనుకున్న పనులను చేయాలని దిశానిర్దేశాలను కూడా ఇచ్చారట. అలాగే ప్రజెంటేషన్కు కూడా మంత్రికి కొంతమేరకు సమయాన్ని ఇచ్చారు.


పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఎన్నోసార్లు అస్వస్థకు ఎదుర్కొన్నారు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఒకవైపు సినిమాలు రాజకీయాలను అలాగే నెట్టుకొస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా కొంతమేరకు భయాందోళనకు గురవుతున్నారు. డిప్యూటీ సీఎంని కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానుల కు , జనసేన కార్యకర్తలకు సైతం ఎలాంటి విషయాన్ని తెలుపుతారో చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను తీసుకున్నటువంటి శాఖలకు సంబంధించిన అన్ని పనులను కూడా త్వరగానే పూర్తి చేసేలా చూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: