![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/donald-trump012dfecb-a1bc-4de4-9dbd-d60d91095c3d-415x250.jpg)
ట్రంప్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఎలాన్ మస్క్ అని చెప్పవచ్చు. ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్రంపు అన్ని పనులు చేస్తున్నారు. అంతేకాదు, విద్యా శాఖను మూసేస్తారట. విచిత్రమైన ప్రకటనలు చేస్తూ దూసుకుపోతున్న మస్క్, ఇప్పుడు ఏకంగా విద్యా శాఖనే వద్దంటున్నారట. విద్యా శాఖను రద్దు చేస్తే వేల కోట్ల డాలర్లు మిగులుతాయని మస్క్ వాదిస్తున్నారట. కానీ, అసలు లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పనుంది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఆకాశాన్నంటే ఫీజులతో సామాన్యులకు అందనంత దూరంలో ఉంటాయి. అందుకే మధ్య తరగతి, పేద వర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థలనే నమ్ముకుంటారు. మన భారతీయులు కూడా అక్కడి యూనివర్సిటీల్లో సీటు కోసం ఎంతో కష్టపడి పోటీ పడతారు. అలాంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థనే రద్దు చేస్తే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి?
విద్యా శాఖను రద్దు చేస్తే డబ్బు మిగులుతుందనే వాదన విడ్డూరంగా ఉంది. డబ్బులు మిగుల్చుకుని భవిష్యత్ తరాల భవితవ్యాన్ని నాశనం చేస్తారా? ఇప్పటికే అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ ట్రంప్ కొత్త నినాదం అందుకున్నారు. బయటి దేశాల నుంచి వచ్చే వారిని కట్టడి చేస్తామంటున్నారు. దీంతో సంతోషంగా ఉన్న అమెరికన్లకు, విద్యా శాఖ రద్దు వార్త పిడుగులాంటి షాక్.
ఇండియాలో చదువు ఎంత భారమో మనందరికీ తెలుసు. లక్ష రూపాయలు సంపాదించే మధ్యతరగతి మనిషికి, అందులో పాతిక వేలు చదువుకు, పాతిక వేలు వైద్యానికి పోతే, ఇక మిగిలేది చిల్లరే. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి వస్తే, సామాన్యుడు ఎలా బతకాలి? ప్రజలు తిరగబడతారనడంలో సందేహం లేదు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, అమెరికా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది.
మరి ట్రంప్ నిజంగానే విద్యా శాఖను రద్దు చేస్తారా? లేక ఇది కేవలం ప్రచార ఆర్భాటమా? సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.