![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/prabhas-sisters06977f38-e0e0-43e8-8b5a-ee403b72421b-415x250.jpg)
వెంటనే మీ అన్నయ్య ప్రభాస్ పెళ్లి చేసేయండి... అంటూ ప్రభాస్ చెల్లెళ్లకు రిక్వెస్ట్ పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కృష్ణంరాజు భార్య... శ్యామలాదేవి తమ బంధువుల పెళ్లికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా శ్యామలాదేవితో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలు కూడా ఈవెంట్ కు వెళ్లడం.. జరిగింది. దీంతో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అలాగే ఆయన చెల్లెళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఆయన అభిమానులు. మీరు పెళ్లిళ్లకు వెళ్లడం కాదు వెంటనే ప్రభాస్ పెళ్లి చేయండి... మీరు వదినను వెతకండి... అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ ఫోటోలతో పాటు అభిమానులు చేసే కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా... కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టారు హీరో ప్రభాస్.
సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నట్లుగా ఇప్పటికీ ట్రెండ్ కొనసాగుతోంది. కృష్ణంరాజు తరహాలోనే ప్రభాస్ కూడా మంచి మంచి సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనుండగా... అటు ప్రశాంత్ నీల్ తో సాలార్ 2 కూడా చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.