![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/tdp49548e73-ccd2-4748-8cdd-a1667871b1d0-415x250.jpg)
సానా సతీష్, బీద మస్తాన్ రావు... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అటవీ భూములు, లిక్కర్ స్కాం, సంబంధించిన అంశాలను పార్లమెంట్ లో మాట్లాడామని.. వారు చేసిన అటవీ భూముల అక్రమాలు, అక్రమ మైనింగ్ ఇతర అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించామని.. మార్గదర్శి పై కామెంట్ చేస్తున్నారు.... వాళ్లు నిధులు తిరిగి చెల్లించారని అన్నారు. ఐదు ఏళ్ళు అధికారంలో ఉన్నారు అప్పుడు ఏం చేశారు.. మిథున్ రెడ్డి పై ఉన్న కేసుల పై దృష్టి మళ్లించే విధంగా మాట్లాడుతున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాం రూ. 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం రూ. 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీలు విమర్శించారు.
టీడీపీ ఎంపీలు ఇంకా ఏమన్నారంటే.. " దీని పై సీబీఐ విచారణ జరిపిస్తే... విచారణలో అన్ని తేలుతాయి.. స్టీల్ ప్లాంట్ అంశం పై ఏనాడు వైసిపి నేతలు మాట్లాడలేదు. 7 నెలల్లో రాష్టానికి ఎన్నో నిధులు తీసుకొచ్చాము.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదని స్టీల్ మంత్రి చెప్పారు. పోలవరం మొదటి దశలో 41 మీటర్లు నిర్మాణం చేస్తాము. పోలవరం పై వైసిపి కి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలకు తెలుసు.. వైసిపి నేతలు కేసులు నుంచి తప్పించుకోకవడం కొరకు ఇవ్వన్నీ మాట్లాడుతున్నారు అన్నారు.
వైసిపి ఎంపీలు మా వెంట నడవాల్సిన అవసరం లేదు.. మిథున్ రెడ్డి, ఇతరుల నేరం రుజవైతే శిక్ష అనుభవించాల్సిందే.. రాజకీయ కక్ష సాధింపు కు దిగితే ఇప్పటికే అరెస్టు అయ్యేవారు.. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాల గురించి... భూ ఆక్రమణలు, అటవీ భూముల ఆక్రమణలు, లిక్కర్ దందా గురించి వివరించాము. ఇవేగాక మైనింగ్ అక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మిథున్ రెడ్డి మార్గదర్శి సంస్థ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..ఆ సంస్థ డిపాజిటర్ల సొమ్ము తిరిగి చెల్లించింది. అదంతా పాత వ్యవహారం. తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఆయన మార్గదర్శి మీద పడ్డారు.. ఢిల్లీ లిక్కర్ స్కాం విలువ రూ. 2 వేల కోట్లు ఉంటేనే సీఎం, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారని టీడీపీ ఎంపీలు అన్నారు.