రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు.. గెలవడం కోసం ప్రత్యర్ధులతో చేతులు కలిపినప్పుడు ఆ ప్రత్యర్థులే రేపటి రోజున తిరిగి మీకు శత్రువులుగా కూడా ఉంటారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్నదని చెబుతూ ఉంటారు.. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఇలా పార్టీని ఇంతకాలం కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ఆపోజిషన్ లో వైసీపీ పార్టీ ఉన్నది.. జగన్మోహన్ రెడ్డిపార్టీ అధినాయకుడుగా ఉన్నారు. అలాగే మరొక పార్టీ జనసేన కూడా ఉన్నది వీటికి పవన్ కళ్యాణ్ అధినాయకుడిగా నిర్వహిస్తున్నారు.


జనంలో పాపులారిటీ చూసుకుంటే జగన్, పవన్ ఇద్దరు కూడా మాస్ లీడర్లే అని చెప్పవచ్చు. టిడిపి కి మాత్రం కొండంత అండగా ఉన్న చంద్రబాబు ఎన్నోసార్లు ఆయన వ్యూహాలకు సాటిరారని కూడా నిరూపించుకున్నారు. అయితే బాబు వయసు ప్రస్తుతం ఏడు పదులకు దగ్గరలో ఉంది. మరో నాలుగేళ్లలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కూటమిలో భాగంగా టిడిపి అధికారంలో ఉన్న ఇప్పుడు టిడిపి పార్టీ గురించి ఒక చర్చ జరుగుతున్నదట. టిడిపి పార్టీ ఒకటి రెండు సార్లు తప్ప పొత్తులు లేనిదే గెలిచేలా కనిపించలేదు. రాబోయే రోజుల్లో ఒంటరిగా పోటీ చేసే గెలిచే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించడం లేదట.


ఇక జనసేన గ్రౌండ్ లెవెల్లో చూస్తే అప్పటికంటే ఇప్పుడు మరింత బలంగా మారిందని వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీ ఎంత చెడుగా ప్రచారం చేసినప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంకు సాధించింది.ఈ పార్టీకి వివిధ సామాజిక వర్గాలనుంచి కూడా మద్దతే ఉన్నది. టిడిపికి ఓటు బ్యాంకు 2024 ఎన్నికలలో వచ్చిన అది పొత్తులో భాగంగా వచ్చినట్లు కనిపిస్తోంది. జనసేన , వైసీపీతో పోలిస్తే టిడిపికి చాలావరకు ఓటు షేర్ తగ్గిందని చెప్పవచ్చు. టిడిపి పార్టీకి ఫ్యూచర్ లీడర్ గా లోకేష్ ఉన్న మాస్ లీడర్ గా మాత్రం వెలగలేకపోతున్నారు. అందుకే టిడిపి ,జనసేన పార్టీని వదిలిపెట్టదనే విధంగా కొనసాగుతూ ఉన్నాయి.. టిడిపి కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు మక్కువ చూపదనే విధంగా చర్చలు జరుగుతున్నాయట. మరి 2029లో ఏం జరుగుతుందో చూడాలి.మరి వీటి పైన చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి టీడీపీ పార్టీని లోకేష్ పేరు వినిపించేలా చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: