![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ap-cm-chandrbabu-eletrick-bill-peopules-fre-current-sc-sta0d008ec-9b06-4744-9b4b-aac92c6515cb-415x250.jpg)
వైసిపి హయాంలో విద్యుత్ చార్జీలు పెంచారని నానా హంగామా చేసిన టిడిపి నేతలు ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా తాను అధికారంలోకి వస్తే ఎలాంటి పెంచుడు ఉండదు అంటూ తెలిపారు. కానీ గత రెండు మూడు నెలలుగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి.. ట్రూ ఆఫ్ చార్జీలని, కస్టమర్ చార్జీలని మరి ఇతర చార్జీలు అంటూ బాధేస్తూ ఉన్నారు. వీటికి తోడుగా కరెంట్ బిల్లు రూ.100రూపాయలు అయితే అదనంగా 120 రూపాయలు దాకా యాడ్ చేస్తున్నారట.
దీంతో ఒక్కసారిగా ప్రజలు కూటమి ప్రభుత్వం పైన గగ్గోలు పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్తును కూడా తీసివేశారని ఆయా వర్గాల సంబంధించిన వారు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇవన్నీ మేము చేసిన తప్పులు కాదంటూ వైసీపీ సర్కార్ చేసిన తప్పులు అంటూ చూపిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆ భారం పడుతోందంటూ వాదనను తెలియజేస్తున్నారట. ప్రజలు మాత్రం అధికారం మీదే కదా వాటన్నిటిని మార్చడానికి మీకు అధికారం ఇచ్చాము మీరు కూడా ఇవే తప్పులు చేస్తూ ఉన్నారు అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ పరిణామాలు అన్నీ కూడా సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకువెళ్లకపోతే కచ్చితంగా కూటమికి పెద్ద షాకే తగిలేలా కనిపిస్తోంది.