విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడి పాత్రలో బుల్లి రాజు అద్భుతంగా నటించారు. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే బుల్లి రాజుపై వైసీపీ సోషల్ మీడియా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. హీరో విశ్వక్సేన్ నటించిన లైలా సినిమాకు బుల్లి రాజు ప్రమోషన్ వీడియో చేశారు. 

కచ్చితంగా లైలా సినిమా చూడాలి అంటూ బుల్లి రాజు జనాలకు పిలుపునిచ్చాడు. అయితే ఇదే విషయంపైన వైసీపీ కార్యకర్తలు కోపంగా ఉన్నారు. లైలా సినిమా బైకాట్ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా బుల్లి రాజు ఇలా చేయడంపై వైసిపి కార్యకర్తలకు కోపం వస్తోంది. దీంతో రంగంలోకి దిగిన వైసిపి బుల్లి రాజుపై షాపింగ్ కామెంట్స్ చేశారు. నీ కెరీర్ ఇక క్లోజ్ రా బుడ్డోడా అంటూ వైసీపీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోంది. నటుడు పృధ్విరాజ్ లైలా సినిమా విషయంలో చేసిన కామెంట్లపై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.


అతడు చేసిన కామెంట్లతో ఇప్పుడు విశ్వక్సేన్ సినిమా వివాదంలో చిక్కుకుంది. వైసిపి పార్టీకి పృధ్విరాజ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ అతను ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు పృథ్వీరాజ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. దీంతో అతని భార్య రంగంలోకి దిగింది.

నా భర్త సినిమాను కేవలం సినిమాల మాత్రమే చూడాలని అతను ఎవరిని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడలేదని పృధ్వీరాజ్ భార్య అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్లనే నా భర్త అనారోగ్యం పాలయ్యాడని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పృథ్వీరాజ్ భార్య ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై పెద్ద వివాదం చెలరేగుతుంది. కాగా, లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: