ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చి నెలలో రిలీజ్ కాబోతోంది. మొత్తం 16,247 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జూన్ నెల నాటికి కంప్లీట్ అయిపోతుందట. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, జీవో 117 స్థానంలో కొత్త పాలసీని కూడా తీసుకురానున్నారు.

టీచర్లకు ఏపీ ప్రభుత్వం మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు టీచర్లు రకరకాల పనుల కోసం ఏకంగా 45 యాప్‌లు వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలు ఉండవు. వాటన్నింటినీ కలిపి ఒకే ఒక్క యాప్‌లోకి తీసుకొచ్చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్వయంగా చెప్పారు. ఇది టీచర్లకు నిజంగా చాలా సౌకర్యంగా ఉండబోతోంది. ఇంకా, టీచర్ల ట్రాన్స్‌ఫర్ల కోసం కొత్త చట్టం కూడా రాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అలాగే, వైస్-ఛాన్స్‌లర్ (VC) నియామకాలు పూర్తయ్యాక, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే చట్టం తీసుకొస్తారట.

మెగా డీఎస్సీలో ఏయే పోస్టులు ఎన్ని ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్లు 7,725.. సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 6,371.. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT) 1,781.. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT) 286.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 132.. ప్రిన్సిపాల్స్ 52.

గతంలో వైసీపీ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఎందుకంటే టీచర్ల ట్రాన్స్‌ఫర్లలో కొన్ని తేడాలు ఉన్నాయని, అలాగే పోస్టులు కూడా తక్కువగా ఉన్నాయని కొత్త ప్రభుత్వం భావించింది. అందుకే పాత జీవోలు, నోటిఫికేషన్లు అన్నీ రద్దు చేశారు. ఇప్పుడు విద్యా మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి, నిరుద్యోగులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: