![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/jagan-2-o-comments-viral578f6879-e7ee-49be-9936-cefcfaf31db2-415x250.jpg)
ఇక అదే సందర్భంలో చట్టబద్ధంగా శిక్షిస్తాము మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలంటే ఇలా ఉండాలి అనేటట్టు చేస్తానని తెలిపారు..ఇంకా కేసులు.. పడతాయి మీ మీద ప్రిపేర్ ఉంటుంది.. అలాగే..2.O పాలన ఇలా ఉండదు ఎలా ఉండాలో చూపెడతానంటూ అదే సమయంలో.. రాబోయే పాతిక 30 ఏళ్లు రాజకీయం చేస్తానన్నటువంటి అంశాన్ని కూడా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ నోటి వెంట రావడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవే కాకుండా కూటమి ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొడుతూ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారని వారు చెప్పిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదని విద్యుత్ చార్జీలు బాదుడు ,విద్య , వైద్యం, వ్యవసాయం ఇవన్నీ వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయట.. కేవలం ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రిగా మారడం వల్లే.. ఒకే ఒక పార్టీ మారింది.. వైసీపీ పక్కకు పోయి టిడిపి వచ్చింది.. ప్రతి వ్యవస్థ కూడా ఇప్పుడు తిరోగమనం పరిస్థితి ఏర్పడుతోందంటూ జగన్ వెల్లడించారు. కేవలం 9 నెలల పాలన ప్రజలని ఎలా మోసం చేశారో కనిపిస్తోంది అంటు తెలిపారు.ఇవేకాకుండా చాలా అంశాలను జగన్ 2.O కింద వెల్లడించడం జరిగింది. తానైతే రాజకీయాల నుంచి పక్కకు వెళ్లేటువంటి వ్యక్తిని కాదు అంటూ తేల్చి చెప్పారు.