ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారు. అయితే తాజాగా వైసిపి పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న... గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని... ఇవాళ ఉదయం పూట అరెస్టు చేశారు. పకడ్బందీగా వల్లభనేని వంశీ ఉంటున్న ఇంటికి వచ్చి.. ఏపీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

 హైదరాబాదులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత... ఏపీకి తరలించారు. వల్లభనేని వంశీని విజయవాడ  కు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ పోలీసులు. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఏపీ పోలీసులు. అయితే వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారు ? అనే విషయాన్ని బయటకి రానివ్వడం లేదు. గన్నవరం టిడిపి పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన కేసులో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.

 ఇప్పటికే ఈ కేసులో చాలామంది అరెస్టయ్యారు. గతంలోనే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లిన వల్లభనేని వంశీ అరెస్టు నుంచి తప్పించుకున్నారు. అయితే ఇవాళ హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని... ఏపీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఏ సెక్షన్ కింద అతన్ని అరెస్టు చేశారో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక కేసులో వైసిపి నేతలను అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే.

 పెద్ద పెద్ద లీడర్లందరూ ఇప్పటికే అరెస్టు కావడం జరిగింది. అటు బడా లీడర్ల పైన కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈ కేసులో భయానికి కొడాలి నాని, పేర్ని నాని లాంటి నేతలు బయటికి రావడం లేదు. అండర్ గ్రౌండ్ లోనే ఉంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే...  వల్లభనేని వంశీని అరెస్టు చేయడం... హాట్ టాపిక్ గా మారింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ.. టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: