కమలహాసన్ కూడా గతంలో మక్కల్ నిధి MM అనే పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. 2024 ఎన్నికలలో డిఎంకేతో పొత్తు పెట్టుకుని మరి పోటీ చేయక అందులో ఒక రాజ్యసభ సీటును కేటాయించారు. అలా పొత్తు సమయంలో దేశ భవిష్యత్తు కోసమే ఆలోచించే కూటమిలో జతకట్టానంటూ తెలిపారు కమలహాసన్. ఇందుకు కారణంగానే కమలహాసన్ కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హామీ ఇచ్చారట.
ఈ ఏడాది జూన్లో మొత్తం 6 మందికి రాజ్యసభకు సంబంధించి పదవి కాలం కూడా పూర్తి కాబోతోందట. దీంతో జులైలో డిఎంకె పార్టీ తరఫునుంచి కమలహాసన్ కి నామినేట్ చేయించేలా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.2021 లో తమిళనాడు అసెంబ్లీ పార్టీలో కమలహాసన్ నిలబడగా అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. 140 స్థానాలలో పోటీ చేయగా ఒక్కచోట కూడా గెలవలేదు కమల్ హాసన్. అందుకే తన పార్టీని డీఎంకే పార్టీతో గత ఎన్నికలలో పూర్తి మద్దతు ప్రకటించారు కమలహాసన్. దీంతో ఆ పార్టీ విజయం కోసం చాలానే కష్టపడ్డారని.. ఆ కష్టానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చేయాలా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏంటన్నది చూడాలి.