![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/tdp-mla-chintamaneni-prabhakar-5a2eab22-050a-4ec6-a528-3d07a53c5a4a-415x250.jpg)
పొట్టకూటి కోసం డ్రైవర్ పనిచేస్తున్న.. వ్యక్తిని బండ బూతులు తిడుతూ అడ్డంగా దొరికిపోయాడు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాయలేని భాషలో.. ఆ డ్రైవర్ను బండ బూతులు తిట్టాడు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఓ పెళ్లి వేడుకకు చింతమనేని ప్రభాకర్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా.. అదే పెళ్లికి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వచ్చారు.
పెళ్లి వేడుక కాబట్టి పార్కింగ్ కాస్త సమస్యగానే ఉంటుంది. దీంతో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు దగ్గరే.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు.. పార్కింగ్ చేశాడు ఆయన డ్రైవర్. అయితే కాస్త... టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా కనిపించింది. అయితే ఈ విషయం గమనించిన చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయాడు. కారులో ఉన్న డ్రైవర్ ను అమ్మ నా బూతులు తిట్టాడు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారులో లేని విషయాన్ని గమనించి... తన నోటికి వచ్చిన బూతులు ఆ డ్రైవర్ను ఉద్దేశించి తిట్టాడు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దీంతో చింతమనేని ప్రభాకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై వైసీపీ కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా రెచ్చిపోయి కామెంట్ చేస్తుంది. ఇక నువ్వు మారవా...? ఓ డ్రైవర్ను పట్టుకొని అలా తిడతావా..,,? అంటూ వైసీపీ సోషల్ మీడియా ఏకీపారేస్తుంది.