తాజాగా ఇటీవలే వైసిపి నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం ఏపీ పోలీసులు కొన్ని నిమిషాల క్రితం అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాదులో ఆయన ఇంటికి చేరుకొని మరి పోలీసులు అరెస్టు చేశారట. అలా హైదరాబాద్ నుంచి విజయవాడకి తనని తరలిస్తున్నారని సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టిడిపి ఆఫీస్ పైన కొంతమంది వైసీపీ నేతలు దాడి చేశారు.అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడుగా ఉన్నారట.. గడిచిన కొన్ని రోజుల క్రితమే వంశీ అనుచరులను పోలీసులు కూడా అరెస్టు చేయడం జరిగింది.అప్పటినుంచి ఈయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారట.



2023 ఫిబ్రవరి 20న గన్నవరం టిడిపి పార్టీ కార్యాలయం పైన ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో దాడికి పాల్పడ్డారని సుమారుగా 5 గంటలపాటు టిడిపి కార్యాలయంలో చాలా విధ్వంసం సృష్టించారని అప్పటి టిడిపి నాయకులు సైతం కేసులు పెట్టిన పోలీసులు విచారణ చేపట్టలేదట.. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఆ కేసును తిరిగి తోడి విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందట.

టిడిపి పార్టీ ద్వారా రాజకీయం మొదలుపెట్టిన వల్లభనేని వంశీ టిడిపి సహకారంతోనే బలమైన నాయకుడిగా ఎదిగారని 2019 ఎన్నికలలో టిడిపి తరఫున గెలిచి వైసిపి నేతగా వ్యవహరించారని.. అంతేకాకుండా నారా లోకేష్, చంద్రబాబు పైన పలు రకాల విమర్శలు చేశారని వార్తలు వినిపించాయి. 2024 లో కూడా వైసీపీని అధికారంలో వస్తుందని ధీమాతో ఉండేవారని టిడిపి తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ టిడిపి కార్యాలయం పైనే దాడి చేశారని అలాగే ఆ నియోజకవర్గంలో కూడా మట్టి తవ్వకాల విషయంలో కూడా పేరు ఎక్కువగా వినిపించిందట. 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ నుంచి బరిలోకి దిగిన వంశీ ఓడిపోయారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ పలు కేసులలో నిందితుడుగా ఉన్నప్పటికీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: